News February 4, 2025

NZB: ఈ నెల 10 వరకు పరీక్ష ఫీజు గడువు

image

తెలంగాణలో ఏప్రిల్-మే నెలలో జరిగే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 10వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 8, 2026

NZB: ప్రచార కార్యక్రమాలపై నిషేధం

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని NZB, BDN, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు.

News February 8, 2026

NZB: బందోబస్తుతో కౌంటింగ్ హాల్‌కు తరలించాలి: కలెక్టర్

image

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం పరిశీలించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ హాల్‌కు తరలించాలని ఆదేశించారు.

News February 8, 2026

NZB: ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

image

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం సందర్శించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌లో ఏర్పాట్లను అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.