News September 26, 2024
NZB: ఈ నెల 30న ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా ఈ నెల 30న ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ నిర్వహణ కార్యదర్శి నాగమణి తెలిపారు. ఈ ఎంపికలు నిజామాబాద్‌లోని నాగారంలో గల రాజారాం స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని పాఠశాలల్లో చదువుతున్న అండర్ 14, 17 బాల బాలికలు తమ బోనఫైడ్, సర్టిఫికెట్స్ తీసుకొని హాజరుకావాలన్నారు.
Similar News
News October 11, 2024
కామారెడ్డి: సహా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి: DSP
సహా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కామారెడ్డి DSP నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక కర్షక్ B.Ed. కళాశాలలో సహా చట్టం 19వ వార్షిక వారోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలు వారికి కావాల్సిన డాక్యుమెంట్స్, FIR, ఛార్జ్ షీట్ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ MA సలీంను అభినందించారు. అనంతరం కేక్ కోసి కార్యక్రమాలకు ముగింపు పలికారు.
News October 11, 2024
నిజామాబాద్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: కలెక్టర్
విజయ దశమి వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చేసుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో చేసుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
News October 11, 2024
కామారెడ్డి: లింగ నిర్దారణ టెస్టులు చేస్తున్న ముఠా అరెస్ట్
లింగ నిర్దారణ టెస్టులు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి SP సింధు శర్మ శుక్రవారం తెలిపారు. రాజంపేట్ వాసి రవీందర్ తన ఇంటి వద్ద అక్రమంగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారన్నారు. 14 మందిని నేరస్థులుగా గుర్తించారు. 5 గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో 9 మందిని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేస్తామని SP తెలిపారు.