News February 28, 2025

NZB: ఉచిత చికెన్ కోసం ఎగబడిన ప్రజలు

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గడంతో చికెన్ అమ్మకందారులు జిల్లాలో రోజుకో చోట చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని బోధన్ బస్టాండ్ సమీపంలో శుక్రవారం మేళా ఏర్పాటు చేశారు. ఉచిత చికెన్ పదార్థాల కోసం భారీగా జనం తరలివచ్చారు. చికెన్ సెంటర్ యజమానులు మాట్లాడుతూ.. కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ అంటూ వచ్చిన వార్తలు వాస్తవమేనని.. కానీ మన జిల్లాలో లేదని స్పష్టం చేశారు.

Similar News

News March 24, 2025

ధర్పల్లి: పది పరీక్ష రాయాలంటే రూ.5 వేలు ఇవ్వాల్సిందే

image

ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

News March 24, 2025

పోతంగల్ : అగ్నిప్రమాదం.. ఇంట్లో వస్తువులన్నీ దగ్ధం

image

పోతంగల్ మండలం కల్లూరుగ్రామంలో అగ్నిప్రమాదం సంభవించి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమై రూ.2లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన బీర్కూర్ భారతి, గంగారాంలు సోమవారం ఉదయం ఇంటిలో పూజా కార్యక్రమాలు ముగించుకొని కూలి పనికి వెళ్లారు. దేవుడి చిత్రపటాల వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడడంతో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది.

News March 24, 2025

నిజామాబాద్: మళ్లీ పెరిగిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. ఉదయం పూట చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో 41℃ ఉష్ణోగ్రత, ముగ్పాల్ మండలంలోని మంచిప్పలో 40.6, కమ్మర్పల్లి, మెండోరా మండల కేంద్రంలో 40.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.

error: Content is protected !!