News December 21, 2024

NZB: ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు

image

NZBలోని కాకతీయ విద్యాసంస్థలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకొని మృతి చెందిన ఘటన మరవకముందే మరో వివాదం చోటుచేసుకుంది. సుభాష్ నగర్ బ్రాంచ్‌లో 8th క్లాస్ విద్యార్థి టాయిలెట్‌కు వెళ్లి హడావిడిలో ప్యాంట్ జిప్ పెట్టుకోవడం మర్చిపోయాడు. దీంతో అతడిని తరగతి గదిలో టీచర్ స్టేజిపైకి ఎక్కించి అవమానించడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News February 23, 2026

NZB: 30 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

image

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 30 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.

News February 23, 2026

NZB: మెడల్స్ సాధించిన సిబ్బందిని అభినందించిన సీపీ

image

4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026లో మెడల్స్ సాధించిన NZB సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. వివిధ విభాగాల్లో పాల్గొన్న పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది 4 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 9 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సీపీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.

News February 23, 2026

NZB: కలెక్టరేట్ ప్రజావాణికి 107 ఫిర్యాదులు

image

NZB కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 107 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ZP సీఈఓ సాయాగౌడ్ తదితరులకు విన్నవించి అర్జీలు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.