News February 6, 2025
NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు

సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
Similar News
News January 22, 2026
నాలుగో మేయర్ కోసం NZB నగరం ఎదురు చూపు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు మేయర్లు పనిచేశారు. ప్రస్తుతం నాలుగో మేయర్ కోసం నగరం ఎదురు చూస్తోంది. మొదటి మేయర్‌గా కాంగ్రెస్ నుంచి ధర్మపురి సంజయ్, రెండో మేయర్‌గా ఆకుల సుజాత (BRS), మూడో మేయర్‌గా దండు నీతూ కిరణ్ (BRS) పని చేయగా నాలుగో మేయర్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
News January 22, 2026
నిజామాబాద్: ఇంటి వద్దే కేసు నమోదు.. మొదట ఇక్కడే

TG డీజీపీ ఆదేశాల మేరకు ఫిర్యాదు ఇంటి వద్దకు వెళ్లి పిటిషన్‌ను స్వీకరిస్తున్నామని NZB రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. తిర్మన్ పల్లికి చెందిన అశ్వినీ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. అయితే దుండగులు తాళం పగల కొట్టి 17 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, రూ.17 వేలు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు సమాచారం మేరకు ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించారు. మెుదటి సారి బాధితురాలి ఇంటికెళ్లి కేసు ఫైల్ చేశారు.
News January 22, 2026
NZB: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు

త్వరలో జరగబోయే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల అధినేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా 20 డివిజన్లలో MIM ప్రాధాన్యత ఉంది. మిగిలిన 40 డివిజన్లలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రభావితం చేసే అభ్యర్థుల కోసం ఇరు పార్టీలు స్క్రూటినీ చేస్తున్నాయి. అలాగే పలువురితో చర్చలు జరుపుతున్నారు.


