News January 6, 2025

NZB: ఉమ్మడి జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కొంత పెరిగి చలి తీవ్రత కాస్త తగ్గింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా గాంధారి 10.0, జుక్కల్ 10.7, రామలక్ష్మణపల్లి 10.9, డోంగ్లి 11.7, లింగంపేట, వేల్పుగొండ 11.9 నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ సౌత్ 12.9, మెండోరా 13.0, వలిపూర్ 13.2,ఎర్గట్ల 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News January 20, 2025

నిజామాబాద్‌లో ప్రజావాణి రద్దు

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున తిరిగి జనవరి 27 నుంచి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.

News January 20, 2025

NZB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వీరే!

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకునే వారి వివరాలు ఇవే. HM కేటగిరీలో బాలచంద్రం(రాకాసిపేట్), శ్రీనివాస్ (పెర్కిట్), SAల్లో కృష్ణారెడ్డి (గూపన్పల్లి), అరుణశ్రీ(కంజర), ఆరోగ్యరాజ్ (గుండారం), సతీశ్ కుమార్ వ్యాస్(బినోల), గోవర్ధన్ (మామిడిపల్లి), హన్మంత్ రెడ్డి (జానకంపేట్), SGTల్లో శ్రీనివాస్(వేంపల్లి), రాధాకృష్ణ (నర్సాపూర్), సాయిలు (కొత్తపల్లి) ఉన్నారు.

News January 20, 2025

NZB: నేడు జిల్లా స్థాయి అవార్డుల పంపిణీ: DEO

image

నిజామాబాద్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) అశోక్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని ఖలీల్వాడీలో ఉన్న న్యూ అంబేడ్కర్ భవన్‌లో ఈ అవార్డుల పంపిణీ ఉంటుందన్నారు. ఈ పంపిణీ గత సెప్టెంబర్‌లో జరపాల్సి ఉండగా వరదల కారణంగా వాయిదా పడిందన్నారు.