News January 24, 2025
NZB: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆదర్శనగర్కు చెందిన లక్ష్మీ 52 కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె భర్తకు ఏడాది క్రితం హార్ట్ ఆపరేషన్ అయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న 3వ టౌన్ ఎస్ఐ హరిబాబు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Similar News
News December 2, 2025
NZB: రెండో రోజూ 1,661 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZBరూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో రెండో రోజైన సోమవారం 196 సర్పంచి స్థానాలకు 456, 1760 వార్డు స్థానాలకు 1,205 నామినేషన్లు దాఖలయ్యాయి. దీనితో రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 578, వార్డు స్థానాలకు 1,353 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వివరించారు.
News December 1, 2025
జీజీ కళాశాలలో మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు ప్రశాంతం

జి.జి.కళాశాలలో శనివారం నుండి మొదలైన (స్వ.ప్ర.) డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. సోమవారం1664 మంది విద్యార్థులకుగాను 57మంది గైర్హాజరయ్యారు.1607మంది విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, తదితర పరీక్షలకు హాజరైనట్లు కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.ఎస్ రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీద బేగం తెలిపారు.
News December 1, 2025
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సోమవారం ఆయన జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.


