News March 10, 2025
NZB: ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను ఖండించిన ఉర్దూ అకాడమీ ఛైర్మన్

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ నిజామాబాద్ అర్వింద్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోబోమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ జవహర్ నవోదయపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంకా స్థల సేకరణ చేపట్టలేదన్నారు. కేవలం ప్రతిపాదనలు మాత్రమే వెళ్లాయని అప్పుడే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై నోరు పారేసుకోవడం తగదన్నారు.
Similar News
News March 10, 2025
నిజామాబాదులో ప్రజావాణికి 95 ఫిర్యాదులు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు.
News March 10, 2025
వేల్పూర్: బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ

నిజామాబాద్ వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మంచిర్యాల నవీన్ కుమార్ 0.080 మిల్లీ గ్రాముల బంగారంతో ICC ఛాంపియన్స్ ట్రోఫీ నమూనా తయారు చేశారు. ఇండియా జట్టు ఫైనల్ గెలవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్లు నవీన్ తెలిపాడు. నవీన్‌ను గ్రామ ప్రజలు, క్రీడాకారులు, తోటి స్నేహితులు అభినందించారు.
News March 10, 2025
NZB: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం..

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగనుందని కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు అర్జీలు సమర్పించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు.