News April 27, 2024

NZB: ఎన్నికల తనిఖీల్లో నగదు, మద్యం స్వాధీనం: CP

image

ఎన్నికల తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ 1.56 లక్షల నగదు, రూ. 89,490 విలువ చేసే 177.76లీటర్ల మద్యం, నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జక్రాన్పల్లి, నిజామాబాద్, ఆర్మూర్, కమ్మర్ పల్లి, భీంగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 కేసుల్లో ఈ నగదు, మద్యం పట్టుకున్నట్లు సీపీ వివరించారు.

Similar News

News October 16, 2025

నిజామాబాద్: ఈనెల 18న జిల్లావ్యాప్త బంద్

image

బీసీ రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అడ్డు పడుతుందని ఆయన విమర్శించారు. ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని కోరారు.

News October 16, 2025

నిజామాబాద్: అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

image

ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్‌లో కొనసాగుతున్న మాధవనగర్ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులతో పాటు ఖలీల్‌వాడిలో నిర్మాణంలో ఉన్న వెజ్-నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు తదితర పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడరాదని సూచించారు.

News October 15, 2025

NZB: విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకూడదు: కలెక్టర్

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.