News April 27, 2024
NZB: ఎన్నికల తనిఖీల్లో నగదు, మద్యం స్వాధీనం: CP

ఎన్నికల తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ 1.56 లక్షల నగదు, రూ. 89,490 విలువ చేసే 177.76లీటర్ల మద్యం, నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జక్రాన్పల్లి, నిజామాబాద్, ఆర్మూర్, కమ్మర్ పల్లి, భీంగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 10 కేసుల్లో ఈ నగదు, మద్యం పట్టుకున్నట్లు సీపీ వివరించారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. నిజామాబాద్ ఏ స్థానంలో ఉందంటే?

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 15,547 మంది పరీక్ష రాయగా 8,806 మంది పాసై 56.64 శాతంతో స్టేట్‌లో 25వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 2,562 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,272 మంది విద్యార్థులు పాసై 49.65 శాతంతో స్టేట్‌లో 33వ స్థానంలో ఉంది.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS..NZB ఏస్థానంలో ఉందంటే?

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. NZB(D)లో రెగ్యులర్ విద్యార్థులు 13,879 మంది పరీక్షలు రాయగా 9,187 మంది పాసై 66.19 శాతంతో స్టేట్‌లో 29వ స్థానంలో నిలిచింది ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 2,345 మందికి 1,587 మంది పాసై 67.68 శాతంతో 29వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1,984 మందికి 584 మంది పాసై 29.44%తో 24వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 221 మందికి 88 మంది పాసై 39.82%తో 31th ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
NZB: చర్చనీయంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఆయన, సొంత పార్టీ నేతల వైఖరితో విసిగిపోయి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్, గతంలో పోచారంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఇక్కడి నేతలు జీవన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు.


