News May 21, 2024
NZB: ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1716264353118-normal-WIFI.webp)
ప్రభుత్వం NZB జిల్లాలోని దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎప్పుడైనా మీ సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు ప్రతి నెలా 2, 4వ వారాల్లో సదరం శిబిరాలను ఏర్పాటు చేసి దానికి వారం ముందు టోకెన్లు జారీ చేసేవారు. ఇకపై సంవత్సరంలో ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకునే వెసులు బాటు కల్పించింది. దరఖాస్తు దారుడి టోకెన్ నంబర్ బట్టి నిర్ణిత తేదీలో కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవచ్చు.
Similar News
News February 13, 2025
మోర్తాడ్: జాతీయస్థాయి కబడ్డీకి ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739348139224_52305189-normal-WIFI.webp)
మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన కుంట సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందించారు. తుది జట్టు ఎంపిక తర్వాత ఒడిషా రాష్టంలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు.
News February 13, 2025
NZB: 70 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739351566532_50139228-normal-WIFI.webp)
భద్రత కోసం మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మహిళా జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 70 శాతం పనిచేయడం లేదని ఆరోపించారు.
News February 13, 2025
NZB: పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739332830907_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లాలో త్వరలో నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ప్రకటించిన పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని 33 మండలాల్లో 1564 పోలింగ్ కేంద్రాలు, 8,51,770 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు ఓటర్లు 3,97,140 ఉండగా మహిళా ఓటర్లు 4,54,613 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు.