News June 4, 2024
NZB: ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీగా గెలిచి..!

నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ సిట్టింగ్ బీజేపీ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కాగా ప్రస్తుతం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థి జీవన్ రెడ్డి పై భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.
Similar News
News October 25, 2025
NZB: జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

నిజామాబాద్-36 మద్యం దుకాణాలకు 963 దరఖాస్తులు, బోధన్-18 మద్యం దుకాణాలకు 455, ఆర్మూర్-25 మద్యం దుకాణాలకు 618, భీమ్గల్-12 మద్యం దుకాణాలకు 369, మోర్తాడ్-11 మద్యం దుకాణాలకు 381 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా NZB094-(ఏర్గట్ల) 96, NZB066-(ఆలూరు) 74, NZB097-(వేల్పూర్) 69 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరించారు.
News October 25, 2025
నిజామాబాద్ రూపురేఖలు మారాలి: NZB కలెక్టర్

నిజామాబాద్ నగర రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా నగర పాలక సంస్థ పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగర పాలక సంస్థ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ, బల్దియా ఆస్తుల పరిరక్షణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై చర్చించారు.
News October 25, 2025
నవీపేట్: పెట్రోలు పోసి మహిళ హత్య

నవీపేట్ మండలం నాగేపూర్ శివారులో మహిళను దారుణ హత్య చేశారు. నిజాంసాగర్ కాలువ పక్కన ఓ మహిళ హత్యకు గురైనట్లు గురువారం రాత్రి సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు మద్దేపల్లికి చెందిన శ్యామల లక్ష్మి(45)గా గుర్తించారు. ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. మృతురాలి చెల్లెలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


