News December 31, 2024

NZB: ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదు: MLC కవిత

image

పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మేడిగడ్డ విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న పిచ్చి ప్రయత్నంతో ఎస్సారెస్పీని ఎండబెట్టారన్నారు. ఎస్సారెస్పీ నుంచి నిజామాబాద్ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు.

Similar News

News January 7, 2025

నేడు కామారెడ్డికి మంత్రి జూపల్లి

image

నేడు కామారెడ్డిలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

News January 6, 2025

NZB: సినిమా ట్రైలర్ రిలీజ్.. ట్రాఫిక్ కష్టాలు

image

నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం రోడ్లు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాత కలెక్టరేట్ వద్ద ఈవెంట్ నిర్వహించగా పోలీసులు కోర్టు చౌరస్తా నుంచి సీపీ క్యాంపు ఆఫీస్ మీదుగా బస్ స్టాండ్ వైపుకు వెళ్లే రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

News January 6, 2025

NZB: ఉమ్మడి జిల్లాలో కాస్త తగ్గిన చలి తీవ్రత

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కొంత పెరిగి చలి తీవ్రత కాస్త తగ్గింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా గాంధారి 10.0, జుక్కల్ 10.7, రామలక్ష్మణపల్లి 10.9, డోంగ్లి 11.7, లింగంపేట, వేల్పుగొండ 11.9 నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా నిజామాబాద్ సౌత్ 12.9, మెండోరా 13.0, వలిపూర్ 13.2,ఎర్గట్ల 13.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.