News August 13, 2024
NZB: ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారుల సోదాలు

నిజామాబాద్ నగరంలోని కోటగిరి ఎస్సీ వసతి గృహంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వసతి గృహంలో తప్పుడు బిల్లులతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వసతి గృహంలో ఉన్న బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను పరిశీలించారు. రికార్డులు, బిల్లుల పరిశీలన కొనసాగుతోంది.
Similar News
News February 27, 2026
ముప్కాల్: మద్యం మత్తులో 100కు ఫోన్.. 10 రోజుల జైలు

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రేంజర్ల గ్రామానికి చెందిన సరుగుల ప్రేమ్ కుమార్‌కు ఆర్మూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని ముప్కాల్ పోలీసులు ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తప్పుడు సమాచారం లేదా అసభ్య ప్రవర్తనతో పోలీసుల సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 27, 2026
NZB: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లో “మనా ఇసుక వాహనం” యాప్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.