News August 13, 2024

NZB: ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారుల సోదాలు

image

నిజామాబాద్ నగరంలోని కోటగిరి ఎస్సీ వసతి గృహంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వసతి గృహంలో తప్పుడు బిల్లులతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వసతి గృహంలో ఉన్న బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను పరిశీలించారు. రికార్డులు, బిల్లుల పరిశీలన కొనసాగుతోంది.

Similar News

News September 21, 2024

ఎల్లారెడ్డి: హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి నిద్రించిన జిల్లా కలెక్టర్

image

ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల వసతి గృహంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం రాత్రి విద్యార్థులతో కలిసి నిద్రించారు. అంతకు ముందు ఆయన విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉన్నాయా? భోజనం ఎలా ఉంటున్నది? మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

News September 21, 2024

నాగన్న బావి పునరుద్ధరణ పనులను ప్రారంభించిన కలెక్టర్

image

లింగంపేటలో పరంపర ఫౌండేషన్, రైన్ వాటర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాచీన కట్టడాలకు పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ వైభవం తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలు పునరుద్ధరణ చేయడంవల్ల భావితరాలకు పూర్వకాలం చరిత్ర తెలిసే వీలు కలుగుతుందని తెలిపారు.

News September 20, 2024

రైల్వేమంత్రిని కలిసిన NZB ఎంపీ అర్వింద్

image

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను NZB ఎంపీ అర్వింద్ దిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వేకి సంబంధించి, పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్వోబీల నిర్మాణం పనులను వేగవంతం చేసేలా అధికారులకు సూచనలను ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.