News August 19, 2024

NZB: ఏడాదిలో 934 అఘాయిత్యాలు.. ఇకనైనా మారుదాం..!

image

రాఖీ వచ్చిందంటే చాలు ఎంతదూర ప్రాంతాల్లో ఉన్నా తమ సోదరీమణుల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుంటారు. ‘నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష’ అంటూ ధైర్యం చెప్పుకుంటారు. సమాజంలో ఇతర మహిళల పట్ల సైతం అదే తీరులో సోదరభావంతో మెలిగితే దేశం సురక్షితంగా ఉంటుంది. ఒక్క 2023లోనే నిజామాబాద్ జిల్లాలో 568 మంది, కామారెడ్డిలో 366 మంది అతివలపై అఘాయిత్యాలు జరిగాయి. మరి మనం ఆడపిల్లలకు ఏ మేర రక్షణగా ఉన్నామో ఆలోచించుకోవాలి.

Similar News

News December 4, 2025

NZB: మరోసారి అవకాశం కల్పిస్తా ఈ సారికి ఆగు..!

image

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి కాగా మూడో విడత కొనసాగుతోంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే వర్గానికి చెందిన పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తా ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.

News December 4, 2025

నిజామాబాద్: 27 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగియగా జిల్లాలో 27 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. వర్ని మండలంలో 10, బోధన్ మండలంలో 4, సాలూర మండలంలో 3, కోటగిరి మండలంలో 5, చందూరు మండలంలో 2, పోతంగల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.

News December 4, 2025

మాక్లూర్: ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

image

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామంలో కూలీ పనులకు వచ్చిన బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ (25) సోమవారం రాత్రి భోజనం వద్ద గుడ్డు కుమార్‌తో ఘర్షణ పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గుడ్డు కుమార్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.