News July 13, 2024

NZB: ఒకే రోజు రెండు పరీక్షలు..!

image

కమ్మర్‌పల్లికి చెందిన DSC అభ్యర్థిని శ్రీలాస్య సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసింది. అయితే తెలుగు, ఇంగ్లిష్ పోస్టులు వేర్వేరుగా ఉండటంతో రెండింటికి దరఖాస్తు చేసింది. ఈనెల 30న ఉ.9 గంటలకు మహబూబ్ నగర్‌ (TL), మ.2 గం హనుమకొండలో (EN) కేటాయించారు. దీంతో ఆమె పరీక్ష ఎక్కడ రాయాలో సందిగ్దంలో పడింది. కాగా దీనిపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. రెండు పరీక్షలు ఒకే చోట రాయోచ్చని తెలిపింది.

Similar News

News September 15, 2025

నిజామాబాద్: ఈనెల 17న ప్రజాపాలన వేడుకలు

image

ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించే వేడుకలపై సోమవారం కలెక్టర్ చర్చించారు. వేడుకకు ముఖ్య అతిథిగా సWఎం సలహాదారు నరేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, పుర ప్రముకులు రానున్న నేపథ్యంలో లోటు పాట్లు లేకుండా చేయాలన్నారు.

News September 15, 2025

NZB: ప్రజావాణికి 23 ఫిర్యాదులు

image

నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు సీపీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల సమస్యలు విన్న సీపీ వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు.

News September 15, 2025

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 22 గేట్ల ద్వారా నీటి విడుదల

image

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 22 గేట్ల ద్వారా 89,680 క్యూసెక్కుల వరదను అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 8000, కాకతీయ 3000, ఎస్కేప్ గేట్లు (రివర్) 5,000, సరస్వతి 800, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 1091 అడుగులకు చేరుకోగా 80.501 TMC నీరు నిల్వ ఉంది.