News July 13, 2024

NZB: ఒకే రోజు రెండు పరీక్షలు..!

image

కమ్మర్‌పల్లికి చెందిన DSC అభ్యర్థిని శ్రీలాస్య సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసింది. అయితే తెలుగు, ఇంగ్లిష్ పోస్టులు వేర్వేరుగా ఉండటంతో రెండింటికి దరఖాస్తు చేసింది. ఈనెల 30న ఉ.9 గంటలకు మహబూబ్ నగర్‌ (TL), మ.2 గం హనుమకొండలో (EN) కేటాయించారు. దీంతో ఆమె పరీక్ష ఎక్కడ రాయాలో సందిగ్దంలో పడింది. కాగా దీనిపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. రెండు పరీక్షలు ఒకే చోట రాయోచ్చని తెలిపింది.

Similar News

News February 18, 2025

ముప్కాల్: కాల్వలో పడి రైతు దుర్మరణం

image

ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన కోమటి శెట్టి చిన్నయ్య (46) అనే రైతు ప్రమాదవశాత్తు శ్రీరామ్ సాగర్ కాకతీయ కాల్వ లో పడి మృతి చెందినట్లు ఎస్ఐ రజినీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాకతీయ కాల్వ మోటార్ ద్వారా తన చేనుకు నీరు అందించుకుంటున్నాడు. మోటర్‌లో నీరు తక్కువగా రావడంతో కాల్వలోకి దిగి నాచు తొలగించుతుండగా నీటి ప్రవాహం ఎక్కువగా రావడంతో కొట్టుకపోయాడు.

News February 18, 2025

NZB: స్టేట్ లెవెల్ స్కేటింగ్‌లో జిల్లా క్రీడాకారులకు మెడల్స్

image

స్టేట్ లెవెల్ స్కేటింగ్‌లో జిల్లా స్వెటర్లు మెడల్స్ సాధించారు. హైదరాబాదులో నిర్వహించిన 13వ ఎస్ ప్రో ట్విన్ సిటీస్ రోలర్ స్కేటింగ్ రాష్ట్రస్థాయి స్కేటింగ్ లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ ప్రదర్శించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి వివిధ కేటగిరీలలో సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొనగా 8 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్ మెడల్స్, 10 బ్రాంజ్ మెడల్స్ సాధించారు.

News February 17, 2025

KMR: అన్న బెదిరింపు.. హత్య చేసిన తమ్ముళ్లు

image

మేడ్చల్‌లో సంచలనం రేపిన <<15484237>>హత్య<<>> కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్(25), రాకేశ్, లక్ష్మణ్‌ అన్నదమ్ములు. మద్యానికి బానిసైన ఉమేశ్‌ వేధింపులు తాళలేక అతడిని దుబాయ్ పంపుదామని ఇంట్లో ప్లాన్ చేశారు. ఇష్టంలేని అతడు ఆ ప్లాన్ చెడగొట్టాడు. ఆదివారం ఇంట్లో ఉన్న తమ్ముళ్లను బెదిరించడంతో వాళ్లు ఎదురుతిరిగారు. ఉమేశ్ పారిపోతుండగా నడిరోడ్డుపై అతడిని దారుణంగా చంపేశారు.

error: Content is protected !!