News February 25, 2025
NZB: ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి: కలెక్టర్

ఈ నెల 27న పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలలో పని చేస్తున్న వారికి సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News December 20, 2025
NZB: ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.
News December 20, 2025
NZB: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి

జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని NZB జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి సూచించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్లో 9, బోధన్లో 4, ఆర్మూర్లో 2 బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ పాల్గొన్నారు.
News December 20, 2025
ఇందూరు: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గని చలి

నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠంగా 16.1 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 30.7 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలివాతావరణం కొనసాగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.


