News January 8, 2025

NZB: ఓపిక పడితే.. అవే దక్కుతాయి: మహేష్ కుమార్ గౌడ్

image

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓపిక పట్టాలని.. అప్పుడే పదవులు దక్కుతాయని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలోని డిచ్పల్లిలో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు నిరాశకు గురి కావద్దని, పదవులు ఖచ్చితంగా దొరుకుతాయని సూచించారు. తనకు PCCపదవి దక్కేందుకు 35 సంవత్సరాలు పట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు

Similar News

News January 13, 2025

NZB: జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి

image

జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.

News January 13, 2025

నిజామాబాద్: బాలుడి గొంతుకోసిన చైనా మాంజా

image

చైనా మాంజా కమ్మర్పల్లిలో కలకలం రేపింది. సోమవారం ఓ వ్యక్తి గాలిపటం ఎగరవేయగా అది తెగిపోయింది. దానికి కట్టిన చైనా మాంజా ఓ బాలుడి(9) గొంతుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. తల్లిదండ్రులు మీ పిల్లలు బయట ఆడుకునేటప్పుడు గమనిస్తూ ఉండండి. ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.

News January 13, 2025

NZB: ఊరు వాడా ఘనంగా భోగి సంబురం

image

ఉమ్మడి NZB జిల్లాల్లో సంక్రాంతి సంబురాలు షురూ అయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు సోమవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ ఇండ్ల ముందు యువతులు, చిన్నారులు రంగు రంగుల ముగ్గులు వేస్తూ..సందడి చేశారు. అటు యువకులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలి పటాలు ఎగురవేస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు.