News April 7, 2025
NZB: కలెక్టరేట్‌లో ఉచిత అంబలి

తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ప్రారంభించారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అన్నారు.
Similar News
News April 8, 2025
గాంధారి: అడవిలోకి తీసుకెళ్లి దాడి.. మహిళ మృతి

అడవిలోకి తీసుకెళ్లి మహిళపై దాడి చేసి చంపేసిన ఘటన సోమవారం గాంధారిలో చోటుచేసుకుంది. SI ఆంజనేయులు తెలిపిన వివరాలు.. చందాపూర్ తండాకు చెందిన పీరాజి HYDలో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అక్కడే బిక్షాటనే చేస్తున్న అమీనాబేగం తన 4ఏళ్ల కొడుకును అమ్మేసిందనే అనుమానంతో ఆమెను HYD నుంచి తండా అడవి ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడ ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం భయంతో ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందింది.
News April 8, 2025
కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
News April 8, 2025
NZB: సర్టిఫికెట్ కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాక్ శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రికల్, సర్వేయర్, ప్లంబర్, మేస్త్రీ, పెయింటింగ్, టైలరింగ్ పెయిడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత వయస్సు 18 నుంచి45 సంవత్సరాలు అని సూచించారు. మరిన్ని వివరాలకు న్యాక్ కేంద్రాన్ని సందర్శించాలన్నారు.