News April 2, 2025
NZB: కవిత GHIBLI ఇమేజ్ చూశారా..

కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్నంగా ప్రశ్నించారు. ఆడ పిల్లలకు స్కూటీ ఇవ్వడంపై ఘిబ్లీ ఇమేజ్తో ఇంస్టాగ్రామ్లో ప్రియాంక గాంధీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రియాంక జీ, స్కూటీ ఎక్కడ ? అంటూ ఇంస్టాగ్రామ్లో స్కూటీ మీనియేచర్ని పట్టుకున్న ఘిబ్లీ ఇమేజ్ను కవిత పోస్ట్ చేశారు.
Similar News
News April 4, 2025
ఎక్స్గ్రేషియా చెక్కు అందజేసిన ఖమ్మం CP

ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో భాధ్యతలు నిర్వహిస్తున్న ఇటీవల హెడ్ కానిస్టేబుల్ బి.పాపా మరణించారు. కాగా హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.8 లక్షల భద్రత ఎక్స్గ్రేషియా చెక్కు మంజూరైంది. శుక్రవారం ఖమ్మం సీపీ సునీల్ దత్ బాధిత కుటుంబానికి మంజూరైన చెక్కును అందజేశారు. శాఖాపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైనా పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటారని సీపీ పేర్కొన్నారు.
News April 4, 2025
గాంధారి మండలంలో అదనపు కలెక్టర్ తనిఖీ

కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందు నాయక్ గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకం, ఉపాధి పనులను లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధారి ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీనారాయణ, గ్రామ కార్యదర్శి ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
News April 4, 2025
నిర్మల్: రేపు కలెక్టరేట్లో జగ్జీవన్ రామ్ జయంతి

నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఉదయం 10 గంటలకు డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జయంతి వేడుకలకు జిల్లాలోని అధికారులు, కుల సంఘాల ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.