News April 3, 2025

NZB: కాంగ్రెస్, బీజేపీలపై MLC కవిత ధ్వజం

image

X వేదికగా కాంగ్రెస్, బీజేపీలపై బుధవారం నిజామాబాద్ MLC కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆమోదించిన చ‌ట్టాల‌ను కోల్డ్‌ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లేతో బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ డ్రామా ఆడారన్నారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం చేశారన్నారు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధ‌ర్నాకు హాజరు పేరిట మమా అనిపించారన్నారు.

Similar News

News April 11, 2025

NZB: ‘సామాజిక సేవా నిర్వహించడం గొప్ప విషయం’

image

నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల విస్తృత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం నిర్వహించిన పలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంతగానో పని ఒత్తిడితో కూడుకుని ఉండే విధుల్లో కొనసాగుతున్నప్పటికీ జిల్లా జడ్జి సేవా కార్యక్రమాలు జరపడం విశేషమన్నారు.

News April 10, 2025

UPDATE: NZB: అంత్యక్రియల అనంతరం అదుపులోకి తీసుకునే అవకాశం?

image

నిజాంబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను ఆయన తల్లి అంత్యక్రియల అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన విషయంలో గతంలోనే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే గురువారం ఆయన దుబాయ్ నుంచి రాగానే అతని వద్ద ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ పోలీసులు ఆయన మీద పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

News April 10, 2025

శంషాబాద్‌లో ఫ్లైట్ దిగగానే మాజీ MLA అరెస్ట్

image

బోధన్ మాజీ MLA షకీల్‌ను శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలలుగా దుబాయ్‌లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే.. తల్లి అంత్యక్రియల కోసం HYDకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్‌పై పోలీసు శాఖ గతంలో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ప్రగతిభవన్ వద్ద యాక్సిడెంట్‌లో సాక్షాలు తారుమారు చేసి కుమారుడిని రక్షించేందుకు యత్నించినట్లు ఆయన మీద అభియోగాలు ఉన్నాయి.

error: Content is protected !!