News April 4, 2024
NZB: కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు ఉత్కృష్ట అవార్డు
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ నవాతే శ్రీనివాస్ (PC 1917)కు ఉత్కృష్ట అవార్డు వరించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని తెలంగాణ పోలీస్ అకాడమీలో స్విమ్మింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈయన సేవ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. ఉత్తమ సేవలకు గాను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్తా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
Similar News
News January 17, 2025
లింగంపేట్: యాక్సిడెంట్‌లో యువకుడి మృతి.. గ్రామస్థుల ధర్నా
లింగంపేట మండలం ముస్తాపూర్ తండాలో గ్రామానికి చెందిన మోహన్ అనే యువకుడు గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను మృతి చెందాడని కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది.
News January 17, 2025
NZB: కేసీఆర్ కృషి ఫలించింది: MLC కవిత
బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని KCR చేసిన కృషి ఫలించిందని MLC కవిత ‘X’ వేదికగా పేర్కొన్నారు. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని కేసీఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా KCR చేసిన వాదనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమని అన్నారు. ‘ఇది BRS, తెలంగాణ ప్రజల విజయం.. అంటూ’ కవిత ట్వీట్ చేశారు.
News January 17, 2025
రాజంపేట: చైన్ స్నాచింగ్‌కు యత్నించి.. ఖాళీ చేతులతో
బైక్‌పై వెళ్తున్న దుండగులు ఆటోలో వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాగేందుకు ప్రయత్నించగా గొలుసు తెగి ఆమె ఒడిలో పడింది. ఈ ఘటన రాజంపేట మండలం అరగొండ హైస్కూల్ వద్ద గురువారం జరిగింది. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ విషయమై బిక్కనూరు సీఐ సంపత్ మాట్లాడుతూ.. యూనికార్న్ బైక్‌పై ఉన్న వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే 8712686153 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.