News March 5, 2026
NZB: కారు బోల్తా.. ఇద్దరు మృతి

నిజామాబాద్ బైపాస్ రోడ్డుపై గురువారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. మృతులను MHకు చెందిన శోభ వాగ్మారే(42), సత్వ తుకారం వాగ్మారే(45)గా గుర్తించారు. దోమకొండకు చెందిన చింతల శ్రీనివాస్, అనిత, సాహెబ్ రావు, నాగారం సాయిలు, బాలాజీ సత్వ వాగ్మరేతో పాటు డ్రైవర్ సీతారాం శ్రీరామ్‌కు గాయాలయ్యాయి. డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 13, 2026
వనపర్తి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

వనపర్తి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా వీపనగండ్లలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దగడ, పెద్దమందడి, పానుగల్‌తో పాటు పలు మండలాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 13, 2026
అసమగ్ర డేటాతో డీలిమిటేషన్ వద్దు: సోనియా

లోక్‌సభ, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో మహిళకు 33 శాతం సీట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. 2027 జనగణనకు ముందే అసమగ్ర డేటా ఆధారంగా డీలిమిటేషన్‌ను చేయడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా అభివర్ణించారు. ‘నారీ శక్తి వందన అధినియమ్’ సవరణ బిల్లును ఏప్రిల్ 16-18 మధ్య కాకుండా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాలని డిమాండ్ చేశారు.
News April 13, 2026
కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లలో అవినీతి అంటూ BRS చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ పార్టీ SMలో చేస్తున్న దుష్ప్రచారానికి KCRదే బాధ్యతని సీతక్క పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. 48 గంటల్లో ఆ పోస్టులను తొలగించి KCR క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.


