News April 13, 2025

NZB: కారు యాక్సిడెంట్.. ఒకరి మృతి 

image

ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో నందిపేట్‌కు చెందిన శ్రీను(48) ఆదివారం మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. మృతుడు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కమ్మర్‌పల్లి గురుకుల పాఠశాలలో చికెన్ సప్లై చేసేందుకు కారులో వెళ్తున్న క్రమంలో ఉప్లూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. తలకు గాయాలవడంతో మృతి చెందాడు.

Similar News

News November 12, 2025

NZB: అభినందన సభావేదికను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

image

బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులై గురువారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ లో సుదర్శన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా స్థలిని బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు పరిశీలించారు.

News November 12, 2025

NZB: మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: సీపీ

image

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిజామాబాద్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోటార్ వాహన చట్టం(2019) ప్రకారం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో మొదటిసారి పట్టుబడితే రూ.10,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని అన్నారు. 3 సంవత్సరాల వ్యవధిలో రెండోసారి పట్టుబడితే రూ.15,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పేర్కొన్నారు.

News November 12, 2025

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: ఎంపీ అర్వింద్

image

ఇందూరు పట్టణంలో పసుపు బోర్డుకు తగిన స్థలం కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పసుపు బోర్డుకు స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్న జిల్లా నేతలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లకు ఇందూరు ప్రజలే బుద్ధి చెప్పాలని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.