News April 13, 2025

NZB: కారు యాక్సిడెంట్.. ఒకరి మృతి 

image

ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో నందిపేట్‌కు చెందిన శ్రీను(48) ఆదివారం మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. మృతుడు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కమ్మర్‌పల్లి గురుకుల పాఠశాలలో చికెన్ సప్లై చేసేందుకు కారులో వెళ్తున్న క్రమంలో ఉప్లూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. తలకు గాయాలవడంతో మృతి చెందాడు.

Similar News

News April 17, 2026

NZB: ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు: కవిత

image

ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆరు నెలల్లోపు పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చి 28 నెలల గడుస్తున్నా మాట ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేపట్టే నిరసన ప్రదర్శనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కవిత ట్వీట్ చేశారు.

News April 17, 2026

నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

image

TGE-JAC పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడి PRC, పెండింగ్ బకాయిలు, హెల్త్ కార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News April 17, 2026

NZB: కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలకు సంబంధించి 08462-220183 నంబర్‌కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.