News February 14, 2025

NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

image

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.

Similar News

News March 12, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో వైద్యుడి దుర్మరణం

image

నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయుర్వేద వైద్యుడు దుర్మరణం చెందాడు. నందిపేట్ మండలం తల్వేదకు చెందిన చిట్టెం హనుమాండ్లు(54) NZBలో గోల్ హనుమాన్ సమీపంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహించేవారు. బైక్‌పై తన దగ్గర పని చేసే శ్రీహరితో కలిసి వెళ్తుండగా పులాంగ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో హనుమాండ్లు మృతి చెందగా శ్రీహరికి గాయాలయ్యాయి.

News March 12, 2025

NZB: 477 మంది గైర్హాజరు

image

జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ 2వ సంవత్సరం బోటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-2ఏ పరీక్షకు మొత్తం 477 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మంది విద్యార్థులకు 16,587 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారన్నారు.

News March 12, 2025

NZB: గ్రూప్-2 ఫలితాల్లో జిల్లా వాసికి 6వ స్థానం

image

గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను TGPSC విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఏర్గట్ల మండలం దొంచంద గ్రామానికి చెందిన ఎర్ర అఖిల్‌కు 430.807 మార్కులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆయనను కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు అభినందించారు.

error: Content is protected !!