News February 14, 2025
NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.
Similar News
News January 7, 2026
‘MSVG’ ప్రమోషన్లకు దూరంగా చిరు.. అందుకేనా?

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల వెన్నెముక భాగంలో చిన్న సర్జరీ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. నొప్పి నుంచి రిలీఫ్ కోసం HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నారని టాక్. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రమోషన్లకు నేరుగా హాజరు కావడం లేదని టీటౌన్ వర్గాల్లో డిస్కషన్. త్వరలో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
News January 7, 2026
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పాలమూరు వాసుల మృతి

ఉజ్జయిని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నచింతకుంట మండలం పర్దిపూర్‌కు చెందిన కావలి నరసింహులు(28), కురువ శివకుమార్(24) దుర్మరణం చెందారు. దైవదర్శనం ముగించుకుని వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన డ్రైవర్ కూడా మృతి చెందారు. గాయపడిన వారు నేడు గ్రామానికి చేరుకోనుండగా, పర్దిపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 7, 2026
కల్వకుర్తి: అంతర్రాష్ట్ర దొంగ పరారీ.. HYDలో పట్టుబడ్డాడు

పోలీస్ కస్టడీ నుంచి పరారైన అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నవంబర్ 13న కల్వకుర్తి పోలీస్ స్టేషన్ బాత్‌రూమ్ కిటికీ నుంచి ఇతడు తప్పించుకున్నాడు. పలు చోట్ల చోరీలకు పాల్పడిన నిందితుడిని HYDలో పట్టుకున్నట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. కాగా.. నంద్యాల(D) కొత్తపల్లి(M) వీరపూర్ వాసి అయిన నాగిరెడ్డి పరారీ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు.


