News May 12, 2024

NZB: కూతురు ఆశయాన్ని కొనసాగిస్తున్న తల్లి

image

NZB జిల్లా కొటగిరికి చెందిన వెంకటమ్మ కూతురిని కోల్పోయిన అమ్మ అనే పిలుపునకు దూరం కాలేదు. ఆమె కూతురు పావని పుట్టుకతోనే దివ్యాంగురాలు. తన వైకల్యాన్ని లెక్కచేయకుండా పావని 18 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుంది. 2018లో పావని మృతి చెందింది. వెంకటమ్మ 70 ఏళ్ల వయస్సులో తన కూతురి ఆశాయాన్ని ముందుకు తీసుకెళ్తోంది. వారిని చదివిస్తూ ముగ్గురు అమ్మాయిలకు పెళ్లి చేశారు. ఇద్దరు యువకులు ఆర్మీలో చేర్పించింది.

Similar News

News July 6, 2025

NZB: VRకు ఏడుగురు SI

image

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్‌ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.

News July 6, 2025

నిజామాబాద్: కళాశాలల మరమ్మతులు, వసతుల కల్పనకు రూ.3.23 కోట్లు

image

నిజామాబాద్ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు, మంచినీటి వసతి, విద్యుత్తు రిపేర్లు, ఇతర కనీస వసతుల నిమిత్తం రూ.3.23 కోట్లు మంజూరు అయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

News July 5, 2025

NZB: ప్రణాళికబద్ధంగా కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధులు, నివేశన స్థలాల క్రమబద్దీకరణ అంశాలపై అధికారులతో సమీక్ష జరిపారు.