News April 4, 2025
NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఎస్ఐ వివరాలు గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News April 18, 2025
NZB: పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను సీపీ సాయి చైతన్య శుక్రవారం తనిఖీ చేశారు. 3, 4, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారు లేదా అని ఆరా తీశారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చూశారు. గంజాయి, సైబర్ నేరాల నిర్మూలనకు కృషి చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
News April 18, 2025
NZB: భూ సమస్యలను గడువులోగా పరిష్కరిస్తాం: కలెక్టర్

భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరిస్తామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్కు లేదా సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను తొలగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదన్నారు.
News April 18, 2025
NZB: దాశరథి పురస్కారానికి జిల్లా వాసి ఎంపిక

నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు ప్రేమ్ లాల్ ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికయ్యాడు. సాహిత్య రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. ఈ విషయాన్ని రావు ఆర్గనైజేషన్ కన్వీనర్ సతీశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మే 1న హైదరాబాద్లో పురస్కార ప్రధాన కార్యక్రమం ఉంటుందన్నారు.