News March 15, 2025
NZB: గంజాయి అమ్ముతున్న యువకుడి అరెస్ట్

నిజామాబాద్ నగరంలోని NGOs కాలనీలో గంజాయి అమ్ముతున్న కోడె సంపంత్ (24)ను నిన్న రాత్రి త్రీ టౌన్ ఎస్సై హరిబాబు అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. గంజాయిని నాందేడ్ నుంచి తీసుకొని ఇక్కడ అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడి చేసి నిందితుడిని పట్టుకుని అతడి నుంచి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
Similar News
News April 17, 2026
TU: వార్షికోత్సవ పనులను వేగవంతం చేయాలి: వీసీ

ఈనెల 22న నిర్వహించనున్న యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలని టీయూ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షికోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆరతి, రాంబాబు పాల్గొన్నారు.
News April 17, 2026
LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.
News April 17, 2026
NZB: ఎన్‌ఎస్‌సీ&ఎన్‌పీఎల్ స్పోర్ట్స్ మీట్ ర్యాలీ

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 18 ఉదయం 7 గంటలకు పోలీస్ కమిషనరేట్ & నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌సీ, ఎన్‌పీఎల్-2026 స్పోర్ట్స్ మీట్ ర్యాలీ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ చేపట్టనున్నారు.


