News May 23, 2024

NZB: గంజాయి కేసులో 9 మంది అరెస్ట్

image

గంజాయి కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఏర్గట్ల SI మచ్చేందర్ రెడ్డి తెలిపారు. కమ్మర్‌పల్లికి చెందిన ఆరీఫ్ ఇంట్లో ఫంక్షన్‌కి HYDకి చెందిన అబ్దుల్ రెహమాన్, అజర్, శంషద్, సమీర్, వంశీవర్ధన్, సలీం పాషా హాజరయ్యారు. నిర్మల్‌కి చెందిన షాదుల్లా, అజారుద్దీన్ వద్ద గంజాయి కొని తాళ్లరాంపూర్ ఈతవనంలో గంజాయి తాగుతూ హంగామా చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి 268 గ్రా. గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు SI వెల్లడించారు.

Similar News

News February 12, 2025

NZB: టిప్పర్ సీజ్

image

నిజామాబాద్‌లో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను సీజ్ చేసినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు. టౌన్ పరిధిలో అక్రమంగా మొరం తరలిస్తుండగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ చిన్న కొండయ్య, యజమాని నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ వెల్లడించారు. గతంలో మొరం అక్రమ రవాణా చేసిన పలువురిని తహశీల్దార్ ఎదుట హాజరుపరచగా రూ.5 లక్షల పూచీకత్తుపై సంవత్సరం వరకు బైండోవర్ విధించినట్లు ఎస్ఐ వివరించారు.

News February 12, 2025

NZB: సీఎం రూ.35 వేలు బాకీ: ఎమ్మెల్సీ క‌విత

image

తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మార్చి 8న హైద‌రాబాద్‌లో త‌ల‌పెట్ట‌నున్న మ‌హిళా శంఖారావం స‌భ పోస్ట‌ర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత బుధ‌వారం త‌న నివాసంలో ఆవిష్క‌రించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో రూ.35వేలు జమ చేయాలన్నారు.

News February 12, 2025

NZB: మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేశారు: కవిత

image

తమ అసమర్థతతో ఇప్పటికే గురుకులాల వ్యవస్థను భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణను గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం Xలో విమర్శించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు లేక భోజనం కోసం విద్యార్థులు ఎండలో కి.మీ. నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పాఠశాల ఆవరణలోనే భోజనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

error: Content is protected !!