News September 14, 2024

NZB: గణేశ్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్

image

గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.

Similar News

News January 3, 2026

నిజామాబాద్: శాంతి భద్రతలపై పోలీసుల ఫోకస్

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల దృష్ట్యా జనవరి 1 నుంచి 15 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా విగ్రహ ప్రతిష్ఠలు చేయకూడదన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు DJలు నిషేధించినట్లు చెప్పారు. బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు ఉంటాయని, డ్రోన్లు, భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

News January 3, 2026

NZB: విద్యతో మహిళలకు విముక్తి దీపం: TPCC అధ్యక్షుడు

image

విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి నివాళి అర్పించారు. మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యమన్నారు. ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.

News January 2, 2026

నిజామాబాద్: దొంగల కోసం గాలిస్తున్నాం: SI

image

నిజామాబాద్ 3 టౌన్ పరిధిలో రైతు బజార్ వద్ద గణేశ్ జువెలరీ షాప్‌లో నిన్న రాత్రి దుండగులు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని త్రీ టౌన్ SI హరిబాబు తెలిపారు. బ్లూకోట్ కానిస్టేబుల్ షట్టర్ ఓపెన్ ఉండటం గమనించి అటువైపు వెళ్లగా ముగ్గురు దుండగులు పారిపోయరన్నారు. షాపు యజమాని వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.