News September 16, 2024

NZB: గణేష్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్

image

గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.

Similar News

News October 25, 2025

నిజామాబాద్: మత్తు పదార్థాల నిరోధానికి కృషి చేయాలి: కలెక్టర్

image

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్‌లో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగంపై వివరించారు.

News October 25, 2025

NZB: యుఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

image

భారత ఐక్య విద్యార్థి సమాఖ్య (USFI) రాష్ట్ర మహాసభలు శనివారం NZBలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఖలీల్ వాడి, బస్టాండ్ మీదుగా మహాసభ ప్రాంగణం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ రాష్ట్ర మహాసభలు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. గత విద్యార్థి ఉద్యమాలపై సమీక్ష చేసి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.

News October 25, 2025

కామారెడ్డి: కులం పేరుతో దాడి..13 మందికి జైలు శిక్ష

image

కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో 13 మంది నిందితులకు NZB కోర్టు శిక్ష విధించింది. సదాశివనగర్(M) అమర్లబండలో రాజేశ్వర్ తన ఇంట్లో భోజనం చేస్తుండగా రతన్ కుమార్‌తో పాటు మరో 12 మంది కులం పేరుతో దుషించి దాడి చేశారు. ఈ కేసును కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు A1 రతన్ కుమార్‌కు 3ఏళ్ల జైలు, రూ.7,200 జరిమానా మిగతా వారికి ఏడాది జైలు, రూ.4,200 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.