News September 16, 2024
NZB: గణేష్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్
గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.
Similar News
News October 14, 2024
భీంగల్: రూ.1,00,000 పలికిన దుర్గామాత లడ్డు
భీంగల్ మండల కేంద్రంలో హనుమాన్ యువజన సంఘం నందిగల్లి భీంగల్ ఆధ్వర్యంలో దుర్గమాత లడ్డు వేలంపాట నిర్వహించారు. కాగా అదే గ్రామానికి చెందిన పిల్లోళ్ల.రాములు అనే వ్యక్తి రూ. 1,00,000/- లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డును పిల్లోల్ల రాములు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News October 13, 2024
NZB: ‘ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయం’
తెలంగాణ సంప్రదాయాల స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కుమార్ మాట్లాడుతూ దత్తాత్రేయ 19 ఏళ్లుగా జెండాలు, ఎజెండాలకు అతీతంగా దసరా మరుసటి రోజు నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం స్పూర్తి అని కొనియాడారు.
News October 13, 2024
పిట్లం: పోలీసులు కంట పడ్డారు.. ఇలా ఆగిపోయారు..
పిట్లం మండలం బొల్లక్పల్లి గ్రామ శివారు మంజీరా నది బ్రిడ్జి సమీపంలో బాన్సువాడ వెళ్లే రహదారిపై ఇవాళ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అయితే వాహనదారులు పోలీసులను చూసి హెల్మెట్ లేక తమకు అపరాధ రుసుము (ఫైన్) వేస్తారని కూత వేటు దూరాన ఆగిపోయారు. ఏ ఒక్కరికి కూడా హెల్మెట్ లేక గంటల తరబడి వేచి ఉన్నారు. హెల్మెట్ భారం కాదు భరోసా అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు హెల్మెట్ వాడకాన్ని విస్మరిస్తున్నారు.