News January 14, 2025
NZB: గల్ఫ్‌లో యాక్సిడెంట్.. రూ.55 లక్షల పరిహారం

గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు కుటుంబానికి రూ.55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి సోమవారం అందజేశారు. 2022లో గల్ఫ్‌లో రాజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. యాబ్ లీగల్ సర్వీసెస్ ద్వారా పరిహారం వచ్చింది. షేక్ ఆల్ అజీజ్, రవుఫ్, మునీత్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 15, 2025
నిజామాబాద్: 18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

నిజామాబాద్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.
News February 15, 2025
NZB: ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్‌లోని సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
News February 15, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఇతడే

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ జాతీయ రహదారి కారు అదుపుతప్పిన ఘటనలో గంగాధర్ (46) అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అతని కూతురు లహరి(20)కి తీవ్రగాయాలయ్యాయి. వీరి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్కునూర్ గ్రామంగా గుర్తించారు. గంగాధర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.