News August 17, 2024

NZB: గుండారం మల్కాపూర్ శివారులో చిరుత కలకలం

image

నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం-మల్కాపూర్ శివారులో మేకపై చిరుతపులి దాడి కలకలం సృష్టించింది. మల్కాపూర్ గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతంలో మేకపై దాడి చేయడంతో మృతి చెందింది. ఘటనా స్థలంలో చిరుత పాదముద్రలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. చిరుత దాడితో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎఫ్ఆర్వో సంజీవ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Similar News

News February 26, 2026

నిజామాబాద్: రూ.151 కే భద్రాచలం తలంబ్రాలు

image

భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు. రాములోరి కళ్యాణానికి వెళ్లలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 26, 2026

NZB: ‘సైక్లింగ్ క్రీడాభివృద్ధికి కృషిచేస్తా’

image

నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు గురువారం జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సైక్లింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు క్రీడా సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని డీవైఎస్‌ఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

News February 26, 2026

BREAKING: నిజామాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

image

నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్‌ను భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌ను TGSPDCL ఛైర్మన్&MDగా బదిలీ చేశారు.