News January 8, 2025
NZB: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్
ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్లైన్లో ఫిబ్రవరి 01వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2025
NZB: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
నిజామాబాద్ ఆర్సపల్లి బైపాస్ రోడ్డులో లారీ ఢీకొని ఓ రైతు మృతి చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు గురువారం తెలిపారు. ఆర్సపల్లికి చెందిన తరికంటి యాదయ్య(78) అర్సపల్లి శివారులోని తన వ్యవసాయ భూమిలో పని ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు ముల మలుపు వద్ద లారీ ఢీకోట్టంది. ఈ ప్రమాదంలో యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News January 24, 2025
NZB: నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే చర్యలు: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా హెచ్చరించారు. గురువారం ధర్మారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. డీఐఈవో రవికుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
News January 23, 2025
నిజామాబాద్: బడారాంమందిర్ గోశాలలో అగ్నిప్రమాదం
నిజామాబాద్ గాజుల్పేట్ బడా రాంమందిర్ గోశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఆలయం పక్కనే ఆవుల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. కాలనీవాసులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు స్పందించి మంటలను ఆర్పివేశారు.