News January 21, 2025
NZB: గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య

నిజామాబాద్ నగర శివారులోని గూపన్ పల్లి స్మశాన వాటిక సమీపంలోని పులాంగ్ వాగు వద్ద దారుణంగా హత్యకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సౌత్ రూరల్ సీఐ, ఎస్సై ఆరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడిని ఎక్కడైన హత్య చేసి పులాంగ్ వాగులో పారేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News October 23, 2025
సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి: కవిత

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ… రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు.
News October 23, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో NZB క్రీడాకారులకు మెడల్స్

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అండర్ 19 రెజ్లింగ్ పోటీల్లో NZB క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 గోల్డ్ మెడల్స్ 3 రజత పథకాలు సాధించారని కోచ్ సంతోష్ తెలిపారు. సఫీయా 76kg విభాగంలో కృష్ణ 65KG విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
News October 23, 2025
NZB: దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి

దివ్యాంగ విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అధికారిణి రసూల్ బీ తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఇంటర్ లేదా ఆపై చదువుతున్న వారికి పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ జాతీయ స్థాయిలో మంజూరు చేస్తామన్నారు. ఇందుకోసం www.scholarships.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.