News January 21, 2025
NZB: గుర్తు తెలియని యువకుడి దారుణ హత్య

నిజామాబాద్ నగర శివారులోని గూపన్ పల్లి స్మశాన వాటిక సమీపంలోని పులాంగ్ వాగు వద్ద దారుణంగా హత్యకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సౌత్ రూరల్ సీఐ, ఎస్సై ఆరీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడిని ఎక్కడైన హత్య చేసి పులాంగ్ వాగులో పారేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News February 14, 2025
NZB: ఒంటరి మహిళ మెడలోంచి గొలుసు అపహరణ

NZBలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకు వెళ్లాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వీక్లీ మార్కెట్‌కు చెందిన విజయ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ ఎస్ఐ మొగులయ్య తెలిపారు.
News February 14, 2025
NZB: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన మహిళ అరెస్ట్

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో మహిళని మావల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. NZBకు చెందిన స్వరూప అనే మహిళ ADBలోని రాంనగర్‌కు చెందిన సాయితేజకు వెటర్నరీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.50 లక్షలు తీసుకుంది. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోగా రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తోంది. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News February 14, 2025
NZB: ఇంటర్‌నేషనల్ కాన్ఫరెన్స్‌కు టీయూ P.D

హైదరాబాద్ వేదికగా ఈ నెల 15 నుండి 16 వరకు జరగనున్న ‘ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ 2025’లో తెలంగాణ యునివర్సిటీ వ్యాయామ విద్యలో సహాయ ఆచార్యులు(సి)గా పని చేస్తున్న డాక్టర్.బి.ఆర్.నేతకు చోటు లభించింది. ఇందుకు ఆయన టీయూ వైస్ ఛాన్సలర్ ప్రో.టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రో.యాదగిరిరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నేతకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.