News March 6, 2025
NZB: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.
Similar News
News March 6, 2025
సిరిసిల్ల: ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వ్యక్తి మృతి

ఇల్లంతకుంట మండలంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయిన ఘటన గురువారం చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం శీలం రజినీకాంత్(26) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో బావిలో పడి మృతి చెందాడు. స్థానిక సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 6, 2025
రిటైర్మెంట్ నిర్ణయంపై సునీల్ ఛెత్రి యూ టర్న్

భారత ఫుట్బాల్ టీమ్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన అంతర్జాతీయ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెలలో జరిగే FIFA ఇంటర్నేషనల్ మ్యాచుల్లో జాతీయ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని ఇండియన్ ఫుట్బాల్ టీమ్ వెల్లడించింది. ఈ 40 ఏళ్ల ప్లేయర్.. గత ఏడాది జూన్లో రిటైర్మెంట్ ప్రకటించారు. IND తరఫున 151 మ్యాచుల్లో 94 గోల్స్ చేశారు.
News March 6, 2025
విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ రద్దు చేయాలని జగన్ పిటిషన్

తమ సంతకం లేకుండానే తన, భారతి షేర్లను తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, వాటిని రద్దు చేయాలని మాజీ CM జగన్ HYD జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT)లో పిటిషన్లు వేశారు. అందులో విజయమ్మ, షర్మిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్ల బదిలీపై స్టే కోరుతూ గతవారం జగన్ దాఖలు చేసిన మధ్యంతర, తాజా పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు వాద, ప్రతివాదులు గడువు కోరారు. దీంతో APR 3కి విచారణ వాయిదా పడింది.