News December 8, 2024
NZB: గొంతు కోసి హత్య చేసిన దుండగులు

ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక మిర్చి కాంపౌండ్‌లోని ఓ ట్రాన్స్ పోర్ట్ షాపు వద్ద నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హతమార్చారు. ఆదివారం ఉదయం షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో 1 టౌన్ సీఐ రఘుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News July 6, 2025
NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.
News July 6, 2025
NZB: VRకు ఏడుగురు SI

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్‌ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.
News July 6, 2025
నిజామాబాద్: కళాశాలల మరమ్మతులు, వసతుల కల్పనకు రూ.3.23 కోట్లు

నిజామాబాద్ జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతులు, మంచినీటి వసతి, విద్యుత్తు రిపేర్లు, ఇతర కనీస వసతుల నిమిత్తం రూ.3.23 కోట్లు మంజూరు అయ్యాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఈ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.