News August 11, 2024
NZB: గ్రామాల్లో పంచాయతీ హడావుడి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల జోరు ఊపందుకుంది. పంచాయతీల వారీగా.. సెప్టెంబర్, అక్టోబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామాల్లో ప్రచారాలు మొదలు పెట్టారు. ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ గత 6 నెలలుగా సర్పంచ్‌లు లేక అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News September 8, 2024
NZB: బురద నీటిలో పడి ఒకరు మృతి
మద్యం మత్తులో బురద నీటిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగర శివారులోని గుండారం కమాన్ వద్ద జరిగింది. నాందేవ్ వాడకు చెందిన సంతలే జ్యోతిరాం(54) మద్యం మత్తులో గుండారం కమాన్ వద్ద పేరుకుపోయిన బురద నీటిలో పడి మృతి చెందాడు. ఆదివారం స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు.
News September 8, 2024
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 9 గేట్లు ఓపెన్
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు నిండటంతో శనివారం రాత్రి 9 గేట్లను ఓపెన్ చేశారు. 52,013 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకి ఇన్ ఫ్లోగా అంతే మొత్తంలో క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగుల (80.5TMC)కు గాను, తాజాగా 1,088.9 అడుగుల (80.053TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News September 8, 2024
బాన్సువాడ: విఘ్నేశ్వరుడికి పూజ చేసిన రాష్ట్ర ఆగ్రో ఛైర్మన్
కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ రామ మందిరంలో వినాయక చవితి సందర్భంగా తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్ రాజ్ విగ్నేశ్వరుడికి శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరి విజ్ఞాలు తొలగి వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, ప్రదీప్, రమాకాంత్ పాల్గొన్నారు.