News March 12, 2025
NZB: గ్రూప్-2లో BC(A) విభాగంలో SIకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడవ బెటాలియన్ రిజర్వ్‌డ్ ఎస్సై BC(A) లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన వరంగంటి అశోక్ నాలుగేళ్లుగా డిచ్పల్లి ఏడవ బెటాలియన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో బీసీఏలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు.
Similar News
News February 9, 2026
NZB: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ కేసులు

నిజామాబాద్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 5 మందికిపైగా గుమిగూడితే 163 BNSS చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. సాయంత్రం 5 గంటల తర్వాత బయట ప్రాంతాల వారు ఉండరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే నాన్ బెయిలబుల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News February 9, 2026
NZB: ఎలక్షన్ ఎఫెక్ట్.. 162 మంది బైండోవర్

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో 162 మందిని సంబంధిత తహశీల్దార్ల ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించిన వారిపై టౌన్-1, టౌన్-3, బోధన్, భీమ్‌గల్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
News February 9, 2026
NZB: 1,500 మంది సిబ్బందితో బందోబస్తు: సీపీ

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ పరిధిలో ఎన్నికల నేపథ్యంలో 1,500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. 3 ప్లాటున్ల TSSP సిబ్బంది , స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.


