News December 14, 2024

NZB: గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 15,16వ తేదీల్లో జరుగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు NZB కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం తెలిపారు. రెండు రోజుల పాటు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇందు కోసం 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.