News February 15, 2025

NZB: ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

image

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్‌లోని సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Similar News

News November 27, 2025

NZB: శుభముహూర్తం చివరి రోజు.. భారీ నామినేషన్లకు అవకాశం!

image

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో ఈసారి సర్పంచ్‌గా నిలబడి గ్రామానికి సేవ చేయాలనే ఆశతో ఎన్నో ఏళ్లుగా పూజలు, వ్రతాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న స్థానిక నాయకుల్లో నామినేషన్ ఉత్సాహం ఉప్పొంగుతోంది. మొదటి విడత 184 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలకు గురువారం శుభముహూర్తం చివరి రోజు కావడం, రేపటి నుంచి మూఢాలు ప్రారంభం అవుతున్న క్రమంలో నేడు భారీ సంఖ్యలో నామినేషన్లు నేడే వేసే అవకాశాలు ఉన్నాయి.

News November 27, 2025

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు: కలెక్టర్

image

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించినట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించినట్లు పేర్కొన్నారు.

News November 27, 2025

నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

image

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్‌కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.