News February 14, 2025

NZB: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

image

NZB జిల్లా బాల్కొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. HYDలోని చింతల్‌కు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్, సంపత్ కారులో కుంభమేళా వెళ్తున్నారు. చిట్టాపూర్‌ వద్ద లారీని ఓవర్టేక్ చేస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. సంపత్ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 16, 2025

NZB: 60 సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్ఠమైన నిఘా: CP

image

తుది విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలలో ఉన్న 60 సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. 24 ఎఫ్.ఎస్.టీ టీమ్స్, 4 ఎస్.ఎస్.టీ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో మొత్తం 194 మందిని సంబంధిత తహశీల్దారుల ముందు హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు వివరించారు.

News December 16, 2025

నిజామాబాద్: ఎన్నికలు.. 11 గన్లు డిపాజిట్

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల వద్ద ఉన్న గనులను డిపాజిట్ చేయాల్సిందిగా సీపీ సాయి చైతన్య ఆదేశించారు. మొత్తం 18 మంది వద్ద గన్ లైసెన్స్‌లు ఉండగా వారిని డిపాజిట్ చేయమన్నామన్నారు. ఇందులో నుంచి 11 గన్లు తమవద్ద డిపాజిట్ అయ్యాయని, మిగతా 7 గన్ లైసెన్సులు బ్యాంకుకు సంబంధించినవని కమిషనర్ వివరించారు.

News December 16, 2025

NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.