News February 14, 2025

NZB: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

image

NZB జిల్లా బాల్కొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. HYDలోని చింతల్‌కు చెందిన రమేశ్, చంద్రశేఖర్, సాయివిశాల్, శ్రీనివాస్, రజినీకాంత్, సంపత్ కారులో కుంభమేళా వెళ్తున్నారు. చిట్టాపూర్‌ వద్ద లారీని ఓవర్టేక్ చేస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. సంపత్ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 16, 2025

నంద్యాల: మొక్కజొన్న రైతు కుదేలు

image

నంద్యాల జిల్లాలో మొక్కజొన్నకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా ఎకరాకు రూ.25వేలు పెట్టుబడి పెట్టామన్నారు. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి ఎకరాకు 20 క్వింటాలే వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా రూ.1800లకు కొనుగోలు చేసేందుకు ఎవరూ రావటం లేదంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

News November 16, 2025

ఖమ్మం: అంకుర ఆసుపత్రి ఆధ్వర్యంలో 5కే రన్

image

గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అంకుర ఆసుపత్రి ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సౌజన్యంతో ఆదివారం 5కే రన్ నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డా.చల్లగుళ్ల రాకేశ్, డా.టి.శ్రీనిధి పర్యవేక్షణలో లకారం ట్యాంక్ బండ్‌ నుంచి ఆసుపత్రి వరకు ఈ రన్ కొనసాగింది. ఈ సందర్భంగా గర్భిణుల సంరక్షణ, నవజాత శిశువుల ఆలనా పాలనా గురించి వారు వివరించారు. ప్రముఖ టీవీ యాంకర్ రవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

News November 16, 2025

జిల్లాలో లాటరీ మోసాలపై ఉక్కుపాదం: ఎస్పీ నరసింహ

image

సూర్యాపేట జిల్లాలో స్థిరాస్తి లాటరీల పేరుతో జరిగే ఆర్థిక మోసాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ‘1000 కట్టు.. ఫ్లాటు పట్టు’ వంటి మోసపూరిత పథకాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకునే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. లాటరీల రూపంలో భూములు, ఫ్లాట్లు అమ్మడం చట్టవిరుద్ధం అన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.