News December 23, 2024
NZB: ‘చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలి’

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విషాహారం తిని గురుకులాల్లో 57 మంది పిల్లలు చనిపోయారని, వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.30,000 బాకీ పడ్డారని వాటిని కూడా చెల్లించాలన్నారు.
Similar News
News December 3, 2025
NZB: స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్లను పరిశీలించిన అబ్జర్వర్

నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC) సెల్‌ను జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల అంశాలకు సంబంధించి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు. మానిటరింగ్ సెల్‌ను తనిఖీ చేశారు. నిఘా బృందాల పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
News December 3, 2025
NZB: 1,760 వార్డులకు 3,764 నామినేషన్లు దాఖలు

జిల్లాలో జరగబోయే 2వ విడత GP 1,760 వార్డు మెంబర్ల (WM) పదవులకు 240 నామినేషన్లు రాగ మొత్తం 3,764 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్పారు. ఇందులో ధర్పల్లి మండలంలోని 194 WMలకు 417, డిచ్పల్లి(M) 306 WMలకు 621, ఇందల్ వాయి(M) 198 WMలకు 412, మాక్లూర్ (M) 230 WMలకు 466, మోపాల్ (M) 192 WMలకు 425, NZB రూరల్(M) 172 WMలకు 348, సిరికొండ (M) 264 WMలకు 583, జక్రాన్ పల్లి (M) 204 WMలకు 492 నామినేషన్లు వచ్చాయి.
News December 3, 2025
NZB: రెండో విడత సర్పంచ్ పదవులకు 1,178 నామినేషన్లు

NZB జిల్లాలో జరగబోయే రెండో విడత GP ఎన్నికల సర్పంచ్ పదవులకు మంగళవారం 196 నామినేషన్లు రాగ మొత్తం 1,178 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో ధర్పల్లి మండలంలోని 22 GP లకు 114, డిచ్పల్లి(M) 34 GPలకు 183, ఇందల్వాయి(M)23 GPలకు 136, మాక్లూర్ (M)26 GPలకు 161, మోపాల్ (M) 21 GPలకు 158, NZB రూరల్(M) 19 GPలకు 113, సిరికొండ (M)30 GPలకు 148, జక్రాన్ పల్లి (M) 21 GPలకు 165 నామినేషన్లు వచ్చాయన్నారు.


